దొడ్డి కొమురయ్య ఆశయాలే మనకు స్ఫూర్తి... ప్రజా సంక్షేమమే లక్ష్యం

by Taduka Kalyani |

నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి రైతుల ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో ఘనంగా నివాళులు అర్పించారు.

దొడ్డి కొమురయ్య ఆశయాలే మనకు స్ఫూర్తి... ప్రజా సంక్షేమమే లక్ష్యం
X

దిశ,సంగారెడ్డి అర్బన్: నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి రైతుల ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో ఘనంగా నివాళులు అర్పించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శనివారం సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఉన్న దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,రైతుల హక్కుల కోసం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం దొడ్డి కొమురయ్య చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్పది అని కొనియాడారు. దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పని చేయాల్సిన అవసరం ఉంది అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారి చూపిన ఉద్యమాలకు సాయుధ రైతాంగ పోరాటం బలమైన పునాదిగా నిలిచిందని, ఆ పోరాటంలో దొడ్డి కొమురయ్య చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆమె కోరారు.అమరవీరుల ఆశయాలను కాపాడుతూ ప్రజల సంక్షేమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని నిర్మలా జగ్గారెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చిద్రుప్ప రఘు గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, రాంరెడ్డి, కౌన్సిలర్లు రమేష్, శైలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story