- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాపంగా మారిన ప్రకృతి.. బంగారు ఈకల కోసం కొంగల వేట
మనకు ఎప్పుడు తెల్లగా కనిపించే కొంగలు.. సంయోగ కాలంలో తన రంగు ప్రకృతి సిద్ధంగా మారిపోతుంది.

దిశ, భద్రాచలం : మనకు ఎప్పుడు తెల్లగా కనిపించే కొంగలు.. సంయోగ కాలంలో తన రంగు ప్రకృతి సిద్ధంగా మారిపోతుంది. ప్రతి సంవతర్సరం ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు గుంపులుగా గూళ్లు కట్టి పిల్లలు పెట్టడానికి చెట్లపైకి చేరుకుంటాయు. ఈ సమయంలో వాటి ఈకలు బంగారు వర్ణంలో ఉంటాయు. అయితే భద్రాచలం కరకట్ట గోదావరి తీరంలోని చెట్ల పైకి ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో పెద్ద ఎత్తున కొంగలు చేరుకుంటాయు. వీటికి ఉన్న బంగారు ఈకల కోసం కొందరు, మాంసం కోసం కొందరు వేటగాళ్లు కేట్ బాల్ ( ఉండేలు ) లాంటి ఆయుధాలతో కొంగలను సంహరిస్తున్నారు. సంయోగ సమయంలో బంగారు పెళ్లి డ్రెస్ వేసుకుంటాయి ఈ కొంగలు.
ఆడ పక్షిని ఆకర్శించడానికి మగ కొంగకి ప్రకృతి సిద్ధంగా మార్చి నెల నుండి తల మీద కిరీటం లాగా, మెడ చుట్టూ కాలర్ లాగా, వీపు మీద జాకెట్ లాగా బంగారు రంగు వస్తుంది. ఈ రంగు రావడానికి కారోటేనాయిడ్ అనే రసాయనం కారణమని సైన్స్ ద్వారా తెలుస్తుంది. అయితే కొంగలు పిల్లలు పెట్టే సమయంలో ఆడ, మగ కొంగలు కలిసి గుంపులుగా ఉండటంతో వేటగాళ్లు బంగారు రంగు ఈకలు ఉన్న కొంగలను చంపుతున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కొంగలను సంహరించడం నేరం. వీటిని చంపడం వలన 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇప్పటికైనా వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారులు కొంగలను సంహరించే వేటగాళ్ళ పై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.






