- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
ఇంటి తళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న మూటను కీసర పోలీసులు పట్టుకున్నారు.

దిశ, కీసర: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న మూటను పట్టుకున్న కీసర పోలీసులు పట్టుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ లో నేరస్థుల వివరాలు జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి మీడియాకు తెలిపారు. ఇటీవల మధ్య కాలంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఇంటి తళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న సొమ్ము ఎత్తుకెళ్లడంలో ఈ గ్యాంగ్ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. వీరు అంత గజ్వేల్ ప్రాంతానికి చెందిన వారు చిన్ననా పెద్దనాన్న కొడుకులు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. దోచుకున్న సొమ్ముతో గోవా వెళ్లి జల్సా చేసి వస్తున్న వారిని మల్కాజిగిరి సి సి ఎస్ టీమ్ సహకారంతో కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఏసీపీ అభినందిస్తూ, ప్రజలు ఇళ్లను తాళం వేసి వెళ్లే సమయంలో భద్రతా చర్యలు పాటించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ ప్రెస్‌మీట్‌లో కీసర సీఐ ఆంజనేయులు, సి సి ఎస్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.






