హామీలిచ్చి తప్పుకోవడం వెన్నతో పెట్టిన విద్య: మాజీ ఎమ్మెల్యే

by Kodari Anjali |

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన పచ్చి అబద్దాలతో సాగుతుందని మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఆరోపించారు.

హామీలిచ్చి తప్పుకోవడం వెన్నతో పెట్టిన విద్య: మాజీ ఎమ్మెల్యే
X

దిశ, డోర్నకల్: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన పచ్చి అబద్దాలతో సాగుతుందని మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఆరోపించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి 70 వేల కోట్ల అప్పులతో ప్రారంభమైందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల హయాంలో 4 లక్షల 17 వేల కోట్ల అప్పు చేసినట్లు సాక్షాత్తు లోక్ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని పథకాన్ని నాటి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం రైతు బంద్, రైతు బీమా ప్రవేశపెట్టారని అన్నారు. పంట పంటకు రైతుబంధు ఖాతాలో జమ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎకరాకు రూ.12,000 పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని ఆరోపించారు. హామీలిచ్చి తప్పుకోవడం రేవంత్ రెడ్డి నైజం అని అన్నారు. పాలన చేతకాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి దిగిపోవాలని సూచించారు. అలాగే తొలత డోర్నకల్ పట్టణ పరిధిలోని మున్నేరు వద్ద గంగమ్మ విగ్రహ ప్రతిష్టకు హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. మాజీ ఎంపీపీ బాలు నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్, సొసైటీ చైర్మన్ బిక్షం రెడ్డి, పుర కౌన్సిలర్ శరత్, రాము, సర్పంచ్ రాయల వెంకటేశ్వర్లు, ఇంజమ్ కృష్ణయ్య, రాంబద్రం, పాండు నాయక్, శ్రీను, మధు, లవన్, హేమచంద్రశేఖర్, తదితరులున్నారు.

Next Story