- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా సూర్యప్రకాశ్ రెడ్డి నియామకం
మండల కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా సూర్యప్రకాశ్ రెడ్డి నియమించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

దిశ, ఊట్కూర్: మండల కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా సూర్యప్రకాశ్ రెడ్డి నియమించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజలకు చేరువ చేసేలా కృషి చేస్తారనే నమ్మకాన్ని నాయకులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన నియామకానికి సహకరించి ప్రోత్సహించిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు ఈ అవకాశం కల్పించడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తలకు అండగా నిలుస్తానని, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలే వెన్నెముక అని పేర్కొన్న ఆయన, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఐక్యతతో ముందుకు సాగుతామని తెలిపారు.






