- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరుంటారక్కడ... అమరావతిపై మరోసారి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతిపై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో కూటమి నేతలు చెప్పరని, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయో కూడా చెప్పరని ఆయన వ్యాఖ్యానించారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)పై మాజీ మంత్రి పేర్ని నాని(Former Minsiter Perni Nani)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో కూటమి నేతలు చెప్పరని, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయో కూడా చెప్పరని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత వడ్డీ కట్టాలో చెప్పరని.. అడిగితే బూతులు తిడతారని పేర్ని నాని మండిపడ్డారు. ‘మావిగన్’(Mavigan) తమ అజెండా అని తాము చెప్పామని, వైఎస్ జగన్(Ys Jagan) ప్రకటనపై 9 మంది మంత్రులు మాట్లాడారని, కానీ వాళ్ల శాఖలపై మాత్రం ఒక్కరు స్పందించని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
అంత చేస్తే ఇంకేమిస్తారు..?
రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం ఇప్పటికే తాకట్టు పెట్టిందని, మొత్తం రూ.50 వేల కోట్లు అప్పులు చేశారని, కార్యాలయాల కోసమే అంత చేస్తే ఇంక రైతులకు ఏమి ఇస్తారంటూ ప్రశ్నించారు. అమరావతిలో చేసే దోపిడీ ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని విమర్శించారు. అమరావతిలో ఇళ్ల పట్టాలు రద్దు చేశారని, ఇంక అక్కడ ఎవరుంటారని ప్రశ్నించారు. జనం లేని రాజధాని ఎందుకని నిలదీశారు. అమరావతిలో కట్టే స్టార్ హోటళ్లను ఏం చేసుకుంటారని పేర్ని నాని ప్రశ్నించారు. ఎప్పుడూ కులాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారని వ్యాఖ్యానించారు. యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు.






