- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హృతిక్ రోషన్‌తో మూవీ సెట్ చేసిన పరశురామ్.. ఏ బ్యానర్‌లో తెరకెక్కనుందో తెలుసా?
హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో పరశురామ్ పెట్ల (పరశురామ్ బుజ్జి) ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన 'గీత గోవిందం' చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. చివరిసారిగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ స్టార్' చిత్రానికి దర్శకత్వం వహించగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా విడుదలై చాలా కాలం గడిచినా పరశురామ్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే తాజాగా ఆయన నెక్స్ట్ మూవీకి సంబంధించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే, పరశురామ్ కెరీర్‌లో ఇది మరో పెద్ద అవకాశం అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






