- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ములుగులో గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
రానున్న రోజుల్లో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, రానున్న ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ,ములుగు జిల్లా ప్రతినిధి: రానున్న రోజుల్లో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, రానున్న ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్ లో కేటీఆర్ స్వగృహంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలోని నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ములుగు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి ఓటును పరిరక్షించే బాధ్యతతో అప్రమత్తంగా పని చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి పనిచేస్తున్నారని అభినందించిన కేటీఆర్ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ ను కలిసిన వారిలో ఎం.డి. వలీ బాబా, ఏటూరు నాగారం పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్, యలవర్తి శ్రీనివాసరావు, కుర్బాన్ అలీ, గద్దల రఘు,తదితరులు ఉన్నారు.






