ఎదురుచూపులకు తెరపడింది అంటూ సినిమా ఓటీటీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

చాలా కాలం తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు సీనియర్ నటుడు వడ్డే నవీన్.

ఎదురుచూపులకు తెరపడింది అంటూ సినిమా ఓటీటీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: చాలా కాలం తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు సీనియర్ నటుడు వడ్డే నవీన్. కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో యంగ్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ప్రమోషన్స్‌తోనే మంచి హైప్ క్రియేట్ సొంతం చేసుకున్న ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దీంతో థియేటర్స్‌లోకి వచ్చిన కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 సొంతం చేసుకోగా.. ‘ఎదురుచూపులకు తెరపడింది.. జులై 17 నుంచి ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ మీ ముందుకు రాబోతున్నది’ అంటూ ప్రకటించారు.

Next Story