- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇస్లాంను అవమానించేలా పాకిస్తానీ సీరియల్.. నెట్టింట ట్రోలింగ్!
by Gantepaka Srikanth |
పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ టెలివిజన్ డ్రామా సీరియల్ 'జబ్త్' (Zabt) తీవ్ర వివాదంలో చిక్కుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ టెలివిజన్ డ్రామా సీరియల్ 'జబ్త్' (Zabt) తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ సీరియల్‌లో ఇస్లాం మతాన్ని, సంప్రదాయాలను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ నెటిజన్లు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రామాలోని 20వ ఎపిసోడ్ ప్రసారమైన తర్వాత ఈ వివాదం ఒక్కసారిగా రాజుకుంది. ముఖ్యంగా నటి సారా ఎజాజ్ (Sara Ejaz) నటించిన ఒక నిర్దిష్ట సన్నివేశంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మతపరమైన సెంటిమెంట్లను గాయపరిచేలా ఆ సీన్‌ను చిత్రీకరించారని, ఇలాంటి కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
Next Story






