కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది

by Taduka Kalyani |

కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలి పోయిందని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది
X

దిశ, సిద్దిపేట అర్బన్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలి పోయిందని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓ వైపు హైడ్రా మరో వైపు ప్రతికూల వాతావరణం, రకరకాల నిబంధనల పేరుతో రియల్ వ్యాపారాలు దెబ్బతిన్నాయన్నారు. సిద్దిపేట కు రేవంత్ రెడ్డి గ్రహణం పట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సిద్దిపేట అభివృద్ధి పనులు నిలిచి పోయాయన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో రైతుల గౌరవం పెరిగిందన్నారు. సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, ఐటీ టవర్, ఇండస్ట్రియల్ పార్క్, మెడికల్ కాలేజీ, రైల్వే రావడంతో పాటుగా, జిల్లా కేంద్రంగా సిద్దిపేట ఎదిగిందని గుర్తు చేశారు. దీంతో ఇతర జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టారన్నారు. కానీ ఇప్పుడు కొనేవాళ్లు తగ్గిపోయారన్నారు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద కిలోమీటర్ల వేగంతో సిద్దిపేట అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా అన్నారు. అంతకు ముందు సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామం లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ద్వార గడప పూజ కార్యక్రమం లో, సిద్దిపేట ఫ్రెండ్స్ టూ విల్లర్స్ మెకానిక్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story