వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దు

by Batti.Sumithra |

వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, డ్రైవింగ్ చేసే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సత్తుపల్లి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దు
X

దిశ, ఏన్కూర్ : వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, డ్రైవింగ్ చేసే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సత్తుపల్లి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆటోలు, ఇతర వాహనాల్లో నిర్ణయించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రమాదాల నివారణ కోసం రవాణా శాఖ అధికారుల ఆదేశాల మేరకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, వాహనాల తనిఖీ సమయంలో వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్‌సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) కార్డు తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలని వాహనదారులకు రాజశేఖర్ రెడ్డి సూచించారు.

Next Story