దండుమైలారంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

by Taduka Kalyani |

కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దండుమైలారంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
X

దిశ, ఇబ్రహీంపట్నం : కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన తాళ్లగూడెం శివకుమార్ (31), డోప్ప శ్రీకాంత్ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్ పై ఇబ్రహీంపట్నం నుండి తమ గ్రామం వైపు వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రమేష్ కారులో దండుమైలారం నుండి ఇబ్రహీంపట్నం వైపు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో రెండు వాహనాలు బలంగా ఢీ కొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, డోప్ప శ్రీకాంత్ కు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడు శివకుమార్ కు ఒక పాప, బాబు ఉన్నారు. ఈ విషాద ఘటన తో దండుమైలారం గ్రామంలో విషాదచాయాలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సింది.

Next Story