- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీడియాకు సియా గోయల్ మిడిల్ ఫింగర్.. ఆమె తండ్రి ఏమన్నారంటే?
కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ రీసెంట్ గా మీడియాకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఓవర్ యాక్షన్ చేసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు సియా గోయల్‌ను పూణేలోని తమ నివాసానికి తీసుకువెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్: కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ రీసెంట్ గా మీడియాకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఓవర్ యాక్షన్ చేసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు సియా గోయల్‌ను పూణేలోని తమ నివాసానికి తీసుకువెళ్లారు. ఇంట్లో తనిఖీలు చేసిన అనంతరం సియా బయటకు వస్తుండగా అక్కడ ఉన్న మీడియావాళ్లు ఆమెను వీడియో తీశారు. ఈ క్రమంలో సియా గోయల్ వారికి మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లి పోలీస్ జీప్ లో కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి సియాగోయల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. న్యాయవ్యవస్థలపై, మీడియాపై సియాకు ఎలాంటి గౌరవం లేదని అంటున్నారు.
దర్జాగా ప్రియుడితో కలిసి కేతన్ ను హత్య చేసి మీడియాకు మిడిల్ ఫింగర్ చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సియా గోయల్ కూడా ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన హనీమూన్ మర్డర్ కేసు నిందితురాలు సోనమ్ రఘువంశీ మాదిరిగా బెయిల్ పై బయటకు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మిడిల్ ఫింగర్ వ్యవహారంపై సియా గోయల్ తండ్రి ప్రవీణ్ స్పందించారు. సియా గోయల్ మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించలేదని, కారు ఎక్కుతున్న సమయంలో ఆమె మధ్య వేలికి గాయం అయ్యిందని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. వీడియోలో క్లియర్ గా సియా గోయల్ ఫింగర్ చూపిస్తున్నట్టు కనిపిస్తున్నా ఆమె తండ్రి కవర్ చేసేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి.






