'బ్లాస్ట్' దర్శకుడితో నాని?

by Pulgam srinivas |

'బ్లాస్ట్' ఫేమ్ సుభాష్ కె. రాజ్ చెప్పిన కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బ్లాస్ట్ దర్శకుడితో నాని?
X

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ స్టార్ దర్శకులతోనే సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉండరు. మంచి కథ దొరికితే కొత్త లేదా చిన్న దర్శకులతోనూ పనిచేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా నాని మరో క్రేజీ దర్శకుడితో సినిమా చేయనున్నారనే వార్త టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం 'బ్లాస్ట్' మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించగా, సుభాష్ కె. రాజ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా విజయంతో దర్శకుడు సుభాష్‌కు మంచి గుర్తింపు లభించింది. తాజా సమాచారం ప్రకారం, నాని-సుభాష్ కె. రాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని, సుభాష్ చెప్పిన కథ నానికి నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Next Story