- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీకా విభాగంలో రెండేళ్లుగా ఒంటరి పోరాటం
హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలోని టీకా విభాగంలో రెండేళ్లుగా అదనపు ఏఎన్ఎం లేక రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

దిశ,హుజూరాబాద్: హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలోని టీకా విభాగంలో రెండేళ్లుగా అదనపు ఏఎన్ఎం లేక రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో చిన్న పిల్లలను టీకాల కోసం తీసుకు రావడం, వీరికి డ్యూటీలో ఉన్న ఒకే ఒక్క ఏఎన్ఎం టీకాలు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో డ్యూటీలో ఉన్న నర్స్ తనపై పడుతున్న అదనపు భారాన్ని రోగుల పై చూపించడం, సమయ పాలన పాటించే అవకాశం లేక పోవడంతో చిన్న పిల్లలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. టీకా విభాగంలో ఒకే ఒక్క నర్సు విధులు నిర్వహించడం మూలంగా సెలవులు పెట్టుకుందామంటే కూడా ఇబ్బంది పడే అవకాశం ఏర్పడుతుందని డ్యూటీ నిర్వహిస్తున్న నర్సు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన అధికారులు వెంటనే ఏరియా ఆసుపత్రిలోని టీకా విభాగంలో వెంటనే అదనపు ఏఎన్ఎం ను నియమించాలని, తద్వారా ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు సంతృప్తికరంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






