క్రాంతి కుమార్ సూసైడ్ కేసు.. సెల్ ఫోన్ సమర్పించాలని ఏసీపీ సూచన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-04 08:57:50  IST  )

విజయవాడలో క్రాంతికుమార్ అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే క్రాంతికుమార్ సెల్ ఫోన్ సమర్పించాలని విజయవాడ నార్త్ ఏసీపీ సూచించారు...

క్రాంతి కుమార్ సూసైడ్ కేసు.. సెల్ ఫోన్ సమర్పించాలని ఏసీపీ సూచన
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో క్రాంతికుమార్ అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్(Selfy Suicide) చేసుకోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే క్రాంతికుమార్ సెల్ ఫోన్ సమర్పించాలని విజయవాడ నార్త్ ఏసీపీ సూచించారు. కృష్ణలంక సీఐ నాగరాజు(Krishan Lanka CI Nagaraju)నే తన ఆత్మహత్యకు కారణమంటూ క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియోలో చెప్పారు. దీంతో సెల్ఫీ తీసిన ఫోన్‌ను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మేరకు క్రాంతి కుమార్ సెల్ ఫోన్ సమర్పించాలని కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు.సెల్ ఫోన్ పరిశీలన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది.

చర్యలేవీ..

మరోవైపు ఈ కేసులో చర్యలు లేవంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కృష్ణలంక సీఐనే ఈ కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు(Sai Krishna Lockup Death Case)లో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలు(Rajahmundry Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను కస్టడీకి తీసుకునే సమయంలో సిట్ అధికారులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ వాయిదా పడటంతో కస్టడీపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా కాంత్రి కుమార్ సూసైడ్ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story