- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీజీపీ సీవీ ఆనంద్ 'ఖమ్మం' పర్యటన రద్దు
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ ప్రతిపాదిత ఉమ్మడి ఖమ్మం జిల్లా రెండు రోజుల పర్యటన వాయిదా పడింది.

దిశ, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ ప్రతిపాదిత ఉమ్మడి ఖమ్మం జిల్లా రెండు రోజుల పర్యటన వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయన జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దయినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, రద్దయిన పర్యటనకు బదులుగా డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం సాయంత్రం ఖమ్మం చేరుకుని, అక్కడి నుంచి నేరుగా భద్రాచలం వెళ్లే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా ఖమ్మం జిల్లాకు వస్తుండటంతో స్థానిక పోలీస్ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. డీజీపీ రాకను పురస్కరించుకుని భద్రతతో పాటు అధికారిక సమీక్షా సమావేశాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పోలీస్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. సోమవారం నాటి పర్యటనకు సంబంధించిన తుది షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానుంది.






