- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏంటి ఈ దౌర్జన్యం, ఎందుకు ఇంత అహంకారం? : రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్టుపై ప్రకాష్ రాజ్ ఫైర్
తెలంగాణకు చెందిన ప్రముఖ యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్ వ్యవహారం ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణకు చెందిన ప్రముఖ యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్ వ్యవహారం ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే, పోలీసులు ఆయనను మరో కేసులో అరెస్ట్ చేయడంపై ప్రముఖ నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ, పోలీసు వైఖరిపై ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా నిప్పులు చెరిగారు. న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేస్తున్నప్పటికీ, పదే పదే కొత్త కేసులు బనాయించి అరెస్టులు చేయడాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు. "ఏంటీ నాటకాలు? ఏంటీ దౌర్జన్యం? ఎందుకు ఇంత అహంకారం?" అంటూ ఆయన పాలకులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధితుడిపై తప్పుడు కేసులు పెడుతున్నారని స్వయంగా కోర్టులు హెచ్చరిస్తున్నా, అధికారులు, ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంపై ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా, పోలీస్ స్టేషన్ వెలుపల చోటుచేసుకున్న పరిణామాలపై కూడా ప్రకాష్ రాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ బయట జనసైనికులు రావణ్‌ను కొట్టేందుకు, ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రశ్న రావణ్ అరెస్ట్ సిరీస్ పై ప్రకాష్ రాజ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విపక్షాలు, సోషల్ మీడియా వేదికగా ఈ పరిణామాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.






