ఫిఫా ప్రపంచకప్ 2026: నేటి నుంచి రౌండ్-16 సమరం.. జర్మనీ, నెదర్లాండ్స్ ఔట్!

by Ramesh Naini |

ఫిఫా ప్రపంచకప్‌లో అసలు సిసలైన నాకౌట్ పోరుకు రంగం సిద్ధమైంది.

ఫిఫా ప్రపంచకప్ 2026: నేటి నుంచి రౌండ్-16 సమరం.. జర్మనీ, నెదర్లాండ్స్ ఔట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫిఫా ప్రపంచకప్‌ 2026లో అసలు సిసలైన నాకౌట్ పోరుకు రంగం సిద్ధమైంది. సంచలనాలకు కేంద్ర బిందువైన ‘రౌండ్ ఆఫ్ 32’ మ్యాచ్‌లు ముగియగా, 16 జట్లు ప్రిక్వార్టర్స్‌కు (రౌండ్-16) ముందంజ వేశాయి. అగ్రశ్రేణి జట్లైన జర్మనీ, నెదర్లాండ్స్ అనూహ్యంగా ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మరోవైపు, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా అతికష్టం మీద కేప్ వెర్డేను ఓడించి గట్టెక్కగా.. ఘనాపై విజయంతో కొలంబియా చివరి బెర్తును ఖరారు చేసుకుంది.

ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించిన 16 జట్లు ఇవే..

కెనడా, బ్రెజిల్, పరాగ్వే, మొరాకో, నార్వే, ఫ్రాన్స్, మెక్సికో, ఇంగ్లండ్, బెల్జియం, అమెరికా (USA), స్పెయిన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, ఈజిప్ట్, అర్జెంటీనా, మరియు కొలంబియా.

Next Story