- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాలు, ఓటీటీ కంటెంట్ పైరసీపై కేంద్రం సీరియస్.. టెలిగ్రామ్‌కు నోటీసులు
ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' (Telegram) ద్వారా పెద్ద ఎత్తున సినిమాలు, ఓటీటీ (OTT) కంటెంట్ పైరసీ అవుతుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' (Telegram) ద్వారా పెద్ద ఎత్తున సినిమాలు, ఓటీటీ (OTT) కంటెంట్ పైరసీ అవుతుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమ పైరసీని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) టెలిగ్రామ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. టెలిగ్రామ్‌లోని వివిధ ఛానళ్లు, గ్రూపుల ద్వారా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కాపీరైట్ ఉన్న ఇతర ప్రీమియం కంటెంట్ అనధికారికంగా లింకులు, ఫైళ్ల రూపంలో విస్తృతంగా షేర్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం.. పైరసీని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 15 రోజుల్లోగా ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్' (Action Taken Report) సమర్పించాలని టెలిగ్రామ్‌ను ఆదేశించింది. యాంటీ పైరసీ చర్యల్లో భాగంగానే కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.






