6వ రోజు కొనసాగుతున్న సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-04 08:51:34  IST  )

పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకుంటే నిరసనలు, ఉద్యమాలను ముమ్మరం చేస్తామని ప్రభుత్వాన్ని సింగరేణి అధికారులు హెచ్చరించారు.

6వ రోజు కొనసాగుతున్న సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు
X

దిశ, గోదావరిఖని: పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకుంటే నిరసనలు, ఉద్యమాలను ముమ్మరం చేస్తామని ప్రభుత్వాన్ని సింగరేణి అధికారులు హెచ్చరించారు. శనివారం గోదావరిఖని జిఎం కార్యాలయం ముందు సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. కోల్ ఇండియా అధికారులతో సమానంగా సింగరేణి అధికారులకు పీఆర్పీ బకాయిల చెల్లింపు, వేతన సవరణ, అలవెన్సులు తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI)–సింగరేణి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్జీ-1 ఏరియా అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

ఆరవ రోజు దీక్షలో CMOAI ఆర్జీ-1 ఏరియా ఉపాధ్యక్షుడు పెరుమాళ్ల శ్రీనివాస్, జీడీకే సీఎంలో యూఎంజీఆర్ రాజు, సీహెచ్‌పీ ఆర్జీ-1 జేఎంఓ వి.వి. నరసింహారావు, డాక్టర్ జి. జెమిమా, డాక్టర్ పి.కె. భాస్కర్‌తో పాటు పలువురు అధికారులు ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కోల్ ఇండియాలో అమలులో ఉన్న విధంగా పే అప్‌గ్రేడేషన్ చేపట్టాలని, అన్ని అలవెన్సులు, సంక్షేమ ప్రయోజనాలు సమానంగా వర్తింపజేయాలని, అలాగే IIT, IIM ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. CMOAI ఆర్జీ-1 ఏరియా ఉపాధ్యక్షుడు పెరుమాళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ, మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. యాజమాన్యం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకొని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్ష కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Next Story