- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హస్తినాపురంలో పడకేసిన పారిశుధ్యం
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హస్తినాపురం పరిధిలోని బైరమల్ గూడా డివిజన్‌లో పలు బస్తీలు, కాలనీలలో చెత్త కుప్పలు పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.

దిశ, హస్తినాపురం, జూలై 4: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హస్తినాపురం పరిధిలోని బైరమల్ గూడా డివిజన్‌లో పలు బస్తీలు, కాలనీలలో చెత్త కుప్పలు పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. వర్షాలు కురుస్తున్న వేళ చెత్త తొలగింపు సక్రమంగా లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్‌లోని నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీ రోడ్ నంబర్లు 11, 7, 5 ప్రాంతాల్లో గత వారం రోజులుగా చెత్తను తొలగించకపోవడంతో రోడ్ల వెంట చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని కాలనీవాసులు తెలిపారు. వర్షాకాలంలో చెత్త పేరుకుపోవడం వల్ల దోమల బెడద మరింత తీవ్రమైందని కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ రోడ్లను ఊడ్చి పరిశుభ్రంగా ఉంచాల్సిన పారిశుద్ధ్య కార్మికులు నాలుగు నుంచి ఐదు రోజులకోసారి మాత్రమే వస్తుండటంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. చెత్త తొలగింపులో నిర్లక్ష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పేరుకుపోయిన చెత్తను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, అధికారులు కనీసం వారానికి ఒక్కసారైనా బస్తీలు, కాలనీలను సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.






