- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTRNeel: యాక్షన్ సీన్స్‌తో కొత్త షెడ్యూల్ స్టార్ట్.. ఎన్టీఆర్ బర్త్‌డేకు ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్!
NTRNeel షూటింగ్ ప్రస్తుతం ఫిలిమ్ సిటీలో జరుగుతుండగా.. ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌గా టీజర్ రిలీజ్ చేసిన పనిలో ఉన్నారట మేకర్స్.

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘NTRNeel’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ఫుల్ మేకోవర్ అయ్యాడు ఎన్టీఆర్. అంతేకాకుండా తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలను సైతం నెట్టింట షేర్ చేస్తూ.. ‘నిశ్శబ్బం పెరిగేకొద్ది.. అంచనాలను ధ్వని రాబోతోంది’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఇక ఆ ఫొటోల్లో ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతుండగా.. ఓ భారీ ఫైట్ సీన్స్ కోసమే ఇంతటి మేకోవర్ అని అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ఆ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ సైతం నెట్టింట దర్శనమిచ్చింది. తాజాగా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ఫిల్మ్ సిటీలో మొదలైందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తుండగా.. విలన్ గ్యాంగ్ కోసం ఓ హాలీవుడ్ యాక్టర్‌ని తీసుకొచ్చారని టాక్. అలాగే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్‌గా టీజర్ రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని ఫిలిమ్ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తుండగా.. అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయని ప్రజెంట్ ఓ పోస్ట్ వైరల్ అవుతున్నది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తున్నారు.
తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్న అనిల్ రావిపూడి .. షూటింగ్ స్టార్ట్ కాకముందే భారీ డీల్






