- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్న అనిల్ రావిపూడి .. షూటింగ్ స్టార్ట్ కాకముందే భారీ డీల్
వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ దర్శకుడు హిట్ మెషీన్‌గా పేరుగాంచారు. ఇటీవలి కాలంలో వరుసగా తన చిత్రాలను సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తూ బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి, వచ్చే సంక్రాంతికి కూడా మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రేజీ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో రూపొందించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా మంచి విజయం సాధించగా, ముఖ్యంగా ఆయన చివరిగా రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు టాలీవుడ్‌లో రీజినల్ ఇండస్ట్రీ హిట్లుగా నిలవడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. దాంతో ఈ దర్శకుడి తదుపరి చిత్రానికి ఇప్పటికే భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమా షూటింగ్ మొదలు కాకముందే ఈ చిత్రానికి సంబంధించిన భారీ డీల్ కుదిరిన నేపథ్యంలో, ఇది చాలా అరుదైన సంఘటనగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






