- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NTRNeel: సైలెంట్‌గా పెద్ద పని చేస్తున్న యూనిట్
‘డ్రాగన్’ షూటింగ్ అప్డేట్… రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ప్రస్తుతం 'డ్రాగన్' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని రీతిలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు సమాచారం. ఆ సన్నివేశాల కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్లు, అలాగే అందుకు తగిన రీతిలో తన బాడీని కూడా మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో మేకర్స్ భారీ యాక్షన్ సీక్వెన్సెస్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న మరో క్రేజీ నటుడు కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆయన ఎవరు అనేది బయటికి తెలియకుండా మూవీ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా చాలా సైలెంట్‌గా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం.






