- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఫుడ్ ఎగుమతుల్లో సరికొత్త అధ్యాయం.. ఎంతో గర్వకారణం: చంద్రబాబు
విశాఖపట్నంలో సీఫుడ్ఎగుమతుల వర్క్‌షాప్‌ను నిర్వహించడం ఎంతో గర్వకారణమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భారతీయ సీఫుడ్ రంగానికి ఒక స్పష్టమైన భవిష్యత్తును నిర్దేశించేందుకు కేంద్ర మంత్రులు, విధానకర్తలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక ప్రముఖులు, ఎగుమతిదారులు, వ్యాపారవేత్తలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు ఈ సదస్సుకు వచ్చారని ఆయన తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం(Visakhapatnam)లో సీఫుడ్(Sea Food) ఎగుమతుల వర్క్‌షాప్‌ను నిర్వహించడం ఎంతో గర్వకారణమని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. భారతీయ సీఫుడ్ రంగానికి ఒక స్పష్టమైన భవిష్యత్తును నిర్దేశించేందుకు కేంద్ర మంత్రులు, విధానకర్తలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక ప్రముఖులు, ఎగుమతిదారులు, వ్యాపారవేత్తలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు ఈ సదస్సుకు వచ్చారని ఆయన తెలిపారు. దేశంలోనే మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్‌లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారత సీఫుడ్ ఎగుమతులలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తోందన్నారు. ప్రపంచ సముద్ర ఆహార ఎగుమతుల కేంద్రంగా భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలనే జాతీయ దార్శనికతకు మన రాష్ట్రం పూర్తి స్థాయిలో తన వంతు మద్దతును అందిస్తోందని చంద్రబాబు తెలిపారు.
ప్రజల జీవితాల్లో సరికొత్త అవకాశాలు
ఎగుమతులను గణనీయంగా పెంచడం, ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం, స్థిరమైన పద్ధతులను పెంపొందించడం ద్వారా మన మత్స్యకారులు, ఆక్వా రైతులు, తీరప్రాంత ప్రజల జీవితాల్లో సరికొత్త అవకాశాలను సృష్టించేందుకు ఈ వర్క్‌షాప్ మన ఉమ్మడి నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.






