- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
రాజేంద్రనగర్ మండలంలోని 23 ప్రభుత్వ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాజేంద్రనగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ మండలంలోని 23 ప్రభుత్వ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాజేంద్రనగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్ స్ట్రక్టర్ పోస్టుకు కనీస అర్హత ఇంటర్ తోపాటు డీఈడీ అర్హత కలిగి ఉండాలని, ఆయా పోస్టులకు కనీస అర్హత ఏడో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని పేర్కొన్నారు. మండలం లోని అత్తాపూర్, బాబుల్ రెడ్డి నగర్, బుద్వేల్, గణేష్ నగర్, లక్ష్మీగూడ, మైలార్ దేవ్ పల్లి, పద్మశాలిపురం, రామ్ భాగ్, గగన్ పహాడ్, సులేమాన్ నగర్, మధుబన్ కాలనీ, శివరాంపల్లి, ఉప్పర్ పల్లి, ఎర్రబోడ, హైదర్ గూడ, జాలాల్ బాబా నగర్, దుర్గా నగర్, నేతాజీ నగర్, శ్రీరామ్ నగర్ హనుమాన్ నగర్, నేతాజీ నగర్, చింతల్ మెట్, సులేమాన్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టుల నియామకం కోసం దరఖాస్తులను ఆయా పాఠశాలల్లో అర్హత జిరాక్సు పత్రాలతో ఈ నెల 6 నుంచి 8వ తేదీలోగా ప్రధా నోపాధ్యాయులకు అందించాలన్నారు. ఇన్ స్ట్రక్టర్, ఆయాలు స్థానికులై ఉండాలని తెలిపారు.






