గాలిదుమారాలకు నేలకొరిగిన సోలార్ ప్లేట్లు..

by Kodari Anjali |

భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

గాలిదుమారాలకు నేలకొరిగిన సోలార్ ప్లేట్లు..
X

దిశ, రామన్నపేట: గత నాలుగు, అయిదు రోజులనుండి ఈదులుగాలులు వీస్తుండటంతో రామన్నపేట మండలం ఉత్తటూర్, కక్కిరేణి, ఇస్కిల్ల తదితర గ్రామాలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అలాగే ఉత్తటూర్‌లో సోలార్ విద్యుత్ ప్లాంట్లో సోలార్ టేబుల్లు, ప్యానెల్లు లేచిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు సోలార్ యాజమాన్యం తెలిపారు. దీంతో 7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం నిలిచిపోయిందన్నారు. అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయి ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది. పలుగ్రామాల్లో ధాన్యం రాశులపై కప్పిన టార్పాలిన్లు కొట్టుకుపోవడంతో ధాన్యం తడిసింది. దీంతో రైతులకు ఆర్థిక నష్టం జరిగింది. పలు గ్రామంలో వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువుల కొట్టాలపై ఉన్న రేకులు ధ్యంసం అయ్యాయి. గాలిదుమారం వల్ల ప్లాంటుకు భారీ నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం తెలిపారు.

Next Story