- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టపగలే ఇంట్లో చోరీ..
కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో పట్టపగలు చోరీ ఘటన కలకలం రేపింది.

దిశ, కుల్కచర్ల: కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో పట్టపగలు చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన బేతి మొగులయ్య ఇంటిలో ఎవరు లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు హెచ్‌ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్‌పై వచ్చి చోరీకి పాల్పడ్డారు. స్థానిక కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా ఎంచుకుని ప్రధాన తలుపును పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని చిన్న లాకర్‌ను తెరిచి అందులో ఉన్న సుమారు రూ.60 వేల నగదు, 8 తులాల వెండి గొలుసులు, రెండు వెండి ఉంగరాలను అపహరించారు.
గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి..
ఈ సమయంలో ఇంటి యజమాని కుమారుడు రాహుల్ ఇంటికి రావడంతో చోరీ జరుగుతున్న విషయాన్ని గమనించాడు. బాలుడిని చూసిన వెంటనే నిందితులు అక్కడి నుంచి హెచ్‌ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్‌పై వేగంగా పరారయ్యారు. సంఘటనపై సమాచారం మేరకు పోలీసులు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సీసీ ఫుటేజీలలో నిందితుల కదలికలు నమోదైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని,అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.






