- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాలుగు రోజుల వ్యవధిలోనే మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నాలుగు రోజుల వ్యవధిలోనే మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 ఖాళీ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జులై1,2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 44 ఏళ్ల లోపు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయని కమిషన్ పేర్కొంది. జూన్ 12 నుండి జులై 19 వరకు ధరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. విద్యార్హతలు, సిలబస్, ఫీజు, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ను సందర్శించాల్సిందిగా టీజీపీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.






