'వారణాసి'పై విజయేంద్రప్రసాద్ క్రేజీ అప్‌డేట్..ఆ 30 నిమిషాలు గూస్ బంప్స్ ప‌క్కా!

by velandi.Saikiran |

'వారణాసి'పై విజయేంద్రప్రసాద్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

వారణాసిపై విజయేంద్రప్రసాద్ క్రేజీ అప్‌డేట్..ఆ 30 నిమిషాలు గూస్ బంప్స్ ప‌క్కా!
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వారణాసి సినిమాపై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా స్టోరీలో ఎక్కువ భాగం రాముడు వర్సెస్ కుంభకర్ణుడి మధ్య ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. వారి మధ్య జరిగే 30 నిమిషాల యుద్ధం సినిమాకు మేజర్ హైలైట్ గా నిలుస్తుందని పేర్కొన్నారు విజయేంద్రప్రసాద్.

మహేష్ బాబును షూటింగ్ లో తొలిసారి రాముడి గెటప్ లో చూసి తనకు గూస్ బంప్స్ వచ్చాయని కూడా తెలిపారు. దీంతో విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా మహేష్ బాబు హీరోగా చేస్తున్న వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అతడి పోస్టర్ కూడా చిత్ర బృందం వదిలింది. దాదాపు రూ.1400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రాజమౌళి చాలా గ్రాండ్ గా తీస్తున్నారు. అంటార్కిటికా ఖండంలోని గడ్డకట్టే మంచు కొండల్లో షూటింగ్ జరుపుకున్న మొదటి సినిమాగా వారణాసి రికార్డు కూడా సృష్టించింది. ఇటు రామోజీ ఫిలిం సిటీలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

Next Story