- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్యావరణ పరిరక్షణ ఒక నైతిక బాధ్యత : మంత్రి కొండా సురేఖ
పర్యావరణ పరిరక్షణ ఒక నైతిక బాధ్యతని, ప్రతి ఒక్కరూ సుస్థిర పద్ధతులను అవలంబించాలని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పర్యావరణ పరిరక్షణ ఒక నైతిక బాధ్యతని, ప్రతి ఒక్కరూ సుస్థిర పద్ధతులను అవలంబించాలని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించిందని, ఈ ఏడాది ఇతివృత్తం ‘వాతావరణ చర్య’ అని తెలిపారు. సనత్ నగర్ లోని టీజీపీసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మనం మన ప్రకృతి మాతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల అవసరం ఎంతగానో ఉందని తెలిపారు. అడవుల నరికివేత, వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ధాన్యం దిగుబడి తగ్గడం వల్ల ఆకలి పెరగడం వంటివన్నీ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే జరుగుతున్నాయని అన్నారు. ‘చికిత్స కన్నా నివారణే మేలు’ అని కూడా పేర్కొన్నారు. ప్రభుత్వ పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖల ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం వల్ల ఎదురవుతున్న సవాళ్లు, పటిష్టమైన పర్యావరణ పాలన, ప్రజా భాగస్వామ్యం, సుస్థిర అభివృద్ధి కార్యక్రమాల ఆవశ్యకతను గుర్తుచేశారు. 2047 నాటికి తెలంగాణ ప్రభుత్వం 250 కోట్ల మొక్కలు నాటి, పచ్చదనాన్ని 33 శాతం పెంచనుందని, పట్టణ ప్రాంతాల్లో కాంక్రీట్ అడవులు పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు కూడా వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు.
‘భూమి ఒక్కటే, మనం దానిని రక్షించుకోవాలి’ అని అన్నారు. టీజీపీసీబీ సభ్య కార్యదర్శి జి. రవి మాట్లాడుతూ గత ఏడాది కాలంలో పీసీబీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 629 పరిశ్రమలపై టీజీపీసీబీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం దాదాపు 1.5°C ఉష్ణోగ్రతను దాటుతున్నామని, గ్లోబల్ వార్మింగ్ కు 1.5°C కంటే తక్కువగా ఉంచాలంటే, 2030 నాటికి వార్షిక గ్రీన్ హౌస్ ఉద్గారాలను తప్పనిసరిగా తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. ఉద్గార ప్రమాణాలను అమలు చేయడం, గ్రీన్హౌస్ వాయువులు మరియు వాతావరణ కాలుష్య కారకాలను పర్యవేక్షించడం, ఉపశమన లక్ష్యాలలో పరిశ్రమలను ఏకీకృతం చేయడం ద్వారా పీసీబీ వాతావరణ చర్యలకు కార్యాచరణ వెన్నెముకగా నిలుస్తోందని తెలిపారు. పరిశ్రమలలో గాలి నాణ్యతను పర్యవేక్షించడం, జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం ద్వారా ఉద్గార పరిమితులను అమలు చేస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించడానికి టీజీపీసీబీ పర్యావరణ చట్టాలు, నిబంధనలను కఠినంగా అమలు చేస్తోందని చెప్పారు. ఏకకాలంలో వాతావరణ మరియు ప్రజారోగ్య సహ-ప్రయోజనాలను సాధిస్తూ, పార్టిక్యులేట్ మ్యాటర్ను తగ్గించడానికి పీసీబీ రాష్ట్రాల వారీగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందన్నారు.
అవార్డుల ప్రదానం..
ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డులను అత్యుత్తమ మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జీలు), పరిశ్రమలు, ఆరోగ్యం మరియు అనుబంధ సేవలు, పాఠశాలలు మరియు కళాశాలలకు ఉత్తమ అవార్డులను అందజేశారు. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక భాగస్వామ్యం, పర్యావరణహిత పద్ధతులు, ఆరోగ్యం మరియు పర్యావరణ అవగాహన వ్యాప్తిలో వారు చేసిన గణనీయమైన కృషికి గాను పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిరత పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, డబ్ల్యూఈడీ 2026 సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర అభివృద్ధి కోసం వినూత్న పరిష్కారాలను తెలియజేస్తూ, హరిత శక్తి, పర్యావరణ అనుకూల సాంకేతికతలు మరియు ఎకో ప్లాస్టిక్లపై వివిధ ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేశారు. గాలి, నీటి నాణ్యత, గాలి నాణ్యత పర్యవేక్షణ పరికరాలు, పరిశ్రమలలో ఏర్పాటు చేసిన రియల్టైమ్ ఆన్లైన్ పర్యవేక్షణ కేంద్రాలను పర్యవేక్షించే కమాండ్ కంట్రోల్ నమూనాపై కూడా టీజీపీసీబీ ఒక స్టాల్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చీఫ్ ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ రఘు, టీజీపీసీబీ అధికారులు మరియు సిబ్బంది హాజరయ్యారు.






