- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి నెల 1నే జీతాలు, పెన్షన్లు ఇవ్వాలి.. ట్రాన్స్‌కో సీఎండీకి టీజాక్ డిమాండ్
విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) డిమాండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం టీజీపీఈజేఏసీ నేతలు ట్రాన్స్‌కో సీఎండీకి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. మే-2026 నెలకు సంబంధించిన జీతాలను ఓఅండ్ఎం ఉద్యోగులకు జూన్ 1న, ఆర్టిజన్లు, ప్రొవిన్షియల్ స్టాఫ్‌కు జూన్ 3న చెల్లించినప్పటికీ.. పెన్షనర్లకు ఇప్పటికీ పెన్షన్ అందలేదని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.
పెన్షనర్లలో అధిక శాతం మంది సీనియర్ సిటిజన్లు నిత్యావసర ఖర్చులు, వైద్య అవసరాలు, మందుల కొనుగోలు కోసం పూర్తిగా ఈ నెలవారీ పెన్షన్‌పైనే ఆధారపడుతున్నారని టీజీపీఈజేఏసీ పేర్కొంది. విద్యుత్ సంస్థలకు దశాబ్దాల పాటు సేవలందించిన వారికి గౌరవం ఇస్తూ సకాలంలో పెన్షన్ చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. మే నెలకు సంబంధించిన పెన్షన్‌ను వెంటనే విడుదల చేయాలని, భవిష్యత్తులో ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లందరికీ ప్రతి నెలా 1వ తేదీన తప్పనిసరిగా చెల్లింపులు జరిగేలా చూడాలని కోరారు. సకాలంలో డబ్బులు అందడం వల్ల ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు పెన్షనర్లకు ఆర్థిక భరోసా కలుగుతుందని టీజీపీఈజేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ రావు స్పష్టం చేశారు.






