- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బదిలీల్లో నిబంధనలు పాటించాం.. దిశ కథనంపై తెలంగాణ జైళ్ల శాఖ వివరణ
తెలంగాణ జైళ్ల శాఖలో బదిలీలన్నీ నిబంధనల మేరకే జరిగాయని, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

- కమిటీ పర్యవేక్షణలోనే పారదర్శకంగా కౌన్సెలింగ్
- ఇష్టారాజ్యంగా బదిలీలు జరిగాయనడం అవాస్తవం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జైళ్ల శాఖలో బదిలీలన్నీ నిబంధనల మేరకే జరిగాయని, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.జైళ్ల శాఖలో ఇష్టారాజ్యంగా బదిలీలు అనే శీర్షికతో ఈ నెల 3న దిశ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై కారాగార శాఖ బుధవారం రిజాయిండర్ విడుదల చేసింది. ఈ వార్త వాస్తవాలకు విరుద్ధంగా ఉందని, జైళ్ల శాఖలో బదిలీలు, పోస్టింగులు జీవో నెం. 38, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే జరిగాయని ఆ శాఖ వివరణ ఇచ్చింది.
కమిటీ పర్యవేక్షణలోనే.. ఐజీ, డీఐజీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో పరిపాలనా సమీక్ష అనంతరమే బదిలీల ప్రక్రియ చేపట్టాం. నిర్దేశిత పదవీకాలం పూర్తికాకముందే సిబ్బందిని బదిలీ చేశారన్న ఆరోపణల్లో నిజం లేదు. అర్హత, స్టేషన్ సీనియారిటీ, ఖాళీల ఆధారంగానే స్థానచలనం కల్పించాం. బదిలీల ప్రక్రియ కోసం ఐజీ నుంచి మొదలుకుని కిందిస్థాయి వార్డర్ వరకు అన్ని స్థాయిల ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కౌన్సెలింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. అందరి అభ్యంతరాలు, వినతులను స్వీకరించి పరిశీలించిన తర్వాతే తుది ఉత్తర్వులు ఇచ్చాం. ఏ ఒక్కరికీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం బదిలీలు చేయలేదు అని జైళ్ల శాఖ తమ ప్రకటనలో పేర్కొంది.
వివరణ
జైళ్ల శాఖలో జరిగిన బదిలీల ప్రక్రియలో పైస్థాయి అధికారుల ఒత్తిళ్లు, అవకతవకలు జరిగాయని బాధిత సిబ్బంది నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం, ఆధారాల మేరకే దిశ ఈ వార్తను ప్రచురించింది. కొందరు ఆధికారులు తెరవెనుక తమకు అనుకూలమైన వారికి పోస్టింగులు ఇప్పించుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది ప్రయోజనాలను కాపాడటం, శాఖలో పారదర్శకతను తీసుకురావాలన్న ఉద్దేశంతోనే దిశ బాధ్యతాయుతంగా ఈ కథనాన్ని వెలుగులోకి తెచ్చింది.






