ఎన్‌హెచ్-65 పనులపై కలెక్టర్, ఎస్పీ స్పెషల్ డ్రైవ్

by Taduka Kalyani |

జిల్లాలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న జాతీయ రహదారి-65 నిర్మాణ పనులకు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ జాయింట్ ఇన్స్పెక్షన్‌తో స్పీడ్ పెంచారు.

ఎన్‌హెచ్-65 పనులపై కలెక్టర్, ఎస్పీ స్పెషల్ డ్రైవ్
X

దిశ,సంగారెడ్డి అర్బన్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న జాతీయ రహదారి-65 నిర్మాణ పనులకు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ జాయింట్ ఇన్స్పెక్షన్‌తో స్పీడ్ పెంచారు. ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోపరిశీలించారు. ఎన్‌హెచ్ఏఐ అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్లు, విద్యుత్, ఆర్&బీ శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ.. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. రహదారులపై ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, డైవర్షన్ సూచికలు, తగిన లైటింగ్ వంటి భద్రతా ప్రమాణాలను 100% అమలు చేయాలని ఆదేశించారు.

వర్షాకాలం హెచ్చరిక..

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, వర్షాలకు రహదారులు దెబ్బతినకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జాతీయ రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రఘువీర్, ఎన్‌హెచ్ఏఐ డీఈఈ రామకృష్ణ, ఈఈ శ్రవణ్ ప్రకాష్, జీఎం రమేష్, ఆర్‌కేసీపీఎల్ కాంట్రాక్టర్ జయప్రకాష్, సంగారెడ్డి, ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లు, డీఎస్పీలు పాల్గొన్నారు.

Next Story