హిమాయత్‌నగర్‌లోని బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం..

by Kodari Anjali |   (  Updated:2026-06-05 16:30:52  IST  )

హిమాయత్‌నగర్ 10వ వార్డులో రాత్రి 8:30 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బట్టల షాప్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

హిమాయత్‌నగర్‌లోని బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం..
X

దిశ, మొయినాబాద్: మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌నగర్ 10వ వార్డులో శుక్రవారం రాత్రి 8:30 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అనురాధ టెక్స్టైల్స్ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో దుకాణంలో ఉన్న వస్త్రాలు, ఇతర సామగ్రి కాలిపోయి సుమారు రూ.5 లక్షల మేర నష్టం జరిగినట్లు యజమాని అనురాధ తెలిపారు. అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి దుకాణం తాళాలు పగలగొట్టి బకెట్లతో నీళ్లు పోసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని బాధితురాలు స్థానికులు పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story