ఒక అద్భుత లోకంలోకి అడుగుపెట్టండి.. టీజర్ అప్డేట్‌తో సినిమాపై హైప్

by Chukka Sudharani |

అక్కినేని సుమంత్ నటిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఒక అద్భుత లోకంలోకి అడుగుపెట్టండి.. టీజర్ అప్డేట్‌తో సినిమాపై హైప్
X

దిశ, సినిమా: వైవిద్యమైన పాత్రలు ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా దూసుకుపోతున్న అక్కినేని సుమంత్ త్వరలో ప్రతిష్టాత్మక చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం, అతీంద్రియ శక్తులు, కొన్ని రహస్య మరణాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చెయ్యగా సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని నెలకొల్పగా.. ఇప్పుడు అదే జోష్‌తో తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘మహేంద్రగిరి వారాహి ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. రహస్యాలు, విశ్వాసం, అంతుచిక్కని విషయాలతో కూడిన ఒక అద్భుత లోకంలోకి అడుగుపెట్టండి. జూన్ 8 న మహేంద్రగిరి వారాహి టీజర్ రాబోతున్నది సిద్ధంగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు.

Next Story