- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల రిమాండ్
వెల్దుర్తి మండలంలో ఇటీవల జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు.

దిశ, తూప్రాన్ : వెల్దుర్తి మండలంలో ఇటీవల జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు. మే 30న రాజమ్మ అనే మహిళను శ్రీకాంత్, శైలని అనే ఇద్దరు వ్యక్తులు సెంట్రల్ బ్యాంక్ సమీపంలో ఆటోలో ఎక్కించుకుని ఆరేగూడెంలో దింపుతామని నమ్మించి తీసుకెళ్లారు. అనంతరం బస్వాపూర్ గ్రామ శివారులోని చెరువు కట్ట ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఆమె ధరించిన బంగారు చెవి కమ్మలను అపహరించి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం నర్సాపూర్-తూప్రాన్ బ్రిడ్జి సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్దూరు శ్రీకాంత్ వద్ద నుంచి ఘటనలో ఉపయోగించిన ఆటోను, అలాగే దొంగిలించిన బంగారు చెవి కమ్మలను కొత్తూరు గ్రామంలోని కృష్ణ జ్యువెలరీ షాప్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్, వెల్దుర్తి ఎస్సై జ్యోతి, పోలీసు సిబ్బంది పి. గోవర్ధన్ రావు, కృష్ణ, సురేష్, మహేష్‌లను తూప్రాన్ డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.






