జీవో 38 ప్రకారం పారదర్శక బదిలీలు చేపట్టాలి : టీజీజీడీఏ

by Naga Rani Yarlagadda |

2024లో అమలు చేసిన విధంగానే, ప్రస్తుతం కూడా పూర్తి పారదర్శకతతో జీవో నెం. 38 ప్రకారం బదిలీలు చేపట్టాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) ప్రభుత్వాన్ని కోరింది.

జీవో 38 ప్రకారం పారదర్శక బదిలీలు చేపట్టాలి : టీజీజీడీఏ
X

దిశ, తెలంగాణ బ్యూరో : 2024లో అమలు చేసిన విధంగానే, ప్రస్తుతం కూడా పూర్తి పారదర్శకతతో జీవో నెం.38 ప్రకారం బదిలీలు చేపట్టాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) ప్రభుత్వాన్ని కోరింది. జీవో 38 నిబంధనల ప్రకారం ఒకే స్టేషన్‌లో 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వైద్యులతో పాటు, 3 సంవత్సరాల ప్రాధాన్యత కలిగిన వైద్యులు, జీరో స్పౌజ్ కేటగిరీ అభ్యర్థులకు కూడా ఆర్డర్ వారీగా బదిలీలు నిర్వహించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం టీజీజీడీఏ ప్రతినిధులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను మంత్రుల నివాస సముదాయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. జీవో నెం.38 ప్రకారం గుర్తింపు పొందిన అసోసియేషన్‌గా తమ ఎన్నికైన నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. తమ సంఘం గతంలో ఉన్న పరిస్థితుల కంటే భిన్నంగా ప్రస్తుతం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకుని, ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులకే బదిలీల నుంచి మినహాయింపు కోరుతున్నట్లు మంత్రికి వివరించారు. తమ విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారని, కీలకమైన విజ్ఞప్తులపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారని అసోసియేషన్ నాయకులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. నరహరి, సెక్రటరీ జనరల్ డా. లాలూ ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డా. రవూఫ్, నాయకులు డా. బొంగు రమేశ్, డా. భూపేందర్, డా. శ్రీనివాస్, డా. మురళి, డా. రాజశేఖర్, డా. రాధాకృష్ణ, డా. వినోద్, డా. సంతోష్, డా. క్రాంతి, డా. శివరామ్, ధీరజ్ తదితరులున్నారు.

Next Story