- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సీక్వెల్ తారక్‌కు ఫ్లాప్‌గా ఎలా మారిందో తెలుసా?
కందిరీగ సీక్వెల్‌గా ప్లాన్ చేసిన కథ, చివరకు ‘రభస’గా తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: ఒక హీరోతో సీక్వెల్‌గా రూపొందించాలనుకున్న సినిమా ద్వారా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ ఫ్లాప్ దక్కింది. అసలు ఆ కథ ఏమిటి? ఎలా మార్పులు జరిగాయి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2011లో ‘కందిరీగ’ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రామ్ పోతినేని హీరోగా, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని, రామ్‌కు మాస్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. అలాగే ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయిన సంతోష్ శ్రీనివాస్‌కు కూడా మంచి గుర్తింపు లభించింది. ‘కందిరీగ’ విజయానంతరం, సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు సీక్వెల్‌గా ఓ కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ఆ కథను ముందుగా రామ్ పోతినేనికి వినిపించగా, కథ మొత్తం విన్న రామ్ అందులో కొన్ని మార్పులు, చేర్పులు సూచించారట. ఆయన సూచించిన విధంగా మార్పులు చేసినప్పటికీ, ఆ కథ రామ్‌కు పూర్తిగా నచ్చలేదని తెలుస్తోంది. దాంతో దర్శకుడు అదే కథను మరింత మెరుగుపరచి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు వినిపించాడట. తారక్‌కు ఆ కథ నచ్చడంతో, ఆ కథనే ‘రభస’ పేరుతో తెరకెక్కించినట్లు సినీ వర్గాల్లో టాక్ ఉంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అలా రామ్‌తో ‘కందిరీగ’ సీక్వెల్‌గా ప్లాన్ చేసిన కథ, చివరికి తారక్‌తో ‘రభస’గా తెరకెక్కి ఫ్లాప్‌గా నిలిచినట్లు తెలుస్తోంది.






