రూ.48 లక్షలతో నీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన..

by Kodari Anjali |

రూ.48 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన నీటి పైప్‌లైన్ పనులకు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.

రూ.48 లక్షలతో నీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన..
X

దిశ, గండిపేట: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్‌పూర్ ప్రాంత ప్రజలకు మెరుగైన త్రాగునీటి సరఫరా అందించేందుకు రూ.48 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన నీటి పైప్‌లైన్ పనులకు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఆధ్వర్యంలో కిస్మత్‌పూర్ సెక్షన్ పరిధిలోని శివాలయం టెంపుల్ నుంచి హిమగిరి నగర్ రోడ్ నెంబర్ 7 వరకు ఈ పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ పనులను ప్రారంభించి మాట్లాడారు. ఈ పైప్‌లైన్ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాంతంలో నెలకొన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన, నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జనరల్ మేనేజర్ లక్ష్మి, డిప్యూటీ జనరల్ మేనేజర్ జవహర్ అలీ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.

Next Story