- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పా కేంద్రాలపై మల్కాజిగిరి పోలీసుల స్పెషల్ డ్రైవ్..
అక్రమాలకు నిలయాలుగా మారిన స్పా కేంద్రాలపై మల్కాజిగిరి పోలీసులు కొరడా ఝూలిపించారు.

దిశ, సిటీక్రైం : అక్రమాలకు నిలయాలుగా మారిన స్పా కేంద్రాలపై మల్కాజిగిరి పోలీసులు కొరడా ఝూలిపించారు. కమిషనరేట్ పరిధిలోని 113 స్పా కేంద్రాలపై స్థానిక పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కలిసి స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ డ్రైవ్ అనేక స్పా కేంద్ర నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా అసాంఘిక వ్యవహారాలను నిర్వహించే విధంగా కార్యకలపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ స్పా కేంద్రాల నిర్వాహకులు నిర్వహణకు సంబంధించి నిబంధనలు పాటించలేదని పోలీసులు తేల్చారు. స్పా కేంద్రాల రిజిస్టర్ లలో ఎంట్రీలకు సంబంధించిన రికార్డులను సరిగా లేవని పోలీసులు తనిఖీల్లో బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్పా కేంద్రాల్లో చీకటి గదులు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు మొత్తం 46 స్పా కేంద్రాల నిర్వాహకులతో పాటు యాజమాన్యాల పై బీఎన్ఎస్ తో పాటు ఇతర సెక్షన్ ల కింద అభియోగాలను నమోదు చేశారు. చాలా చోట్ల అక్రమంగా క్రాస్ మసాజ్ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పా నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సుమతి హెచ్చరించారు.






