మోమిన్ పెట్ మండలంలోని 5 ప్రభుత్వ పాఠశాలల్లో 'ప్రీ-ప్రైమరీ' తరగతులు

by Kodari Anjali |

మోమిన్ పెట్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, అంగన్‌వాడీలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

మోమిన్ పెట్ మండలంలోని 5 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు
X

దిశ, మోమిన్ పెట్: మోమిన్ పెట్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, అంగన్‌వాడీలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మండలంలోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 'ప్రీ-ప్రైమరీ' సెక్షన్లను మంజూరు చేసినట్లు మండల విద్యాధికారి కే నర్సింలు వెల్లడించారు. మండలంలోని ఎంపీపీఎస్ పాఠశాలలు, మోమిన్ పెట్, మో రంగపల్లి అమ్రాది ఉర్దూ చీమలదరి, టేకులపల్లి పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ సెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎంఈఓ పేర్కొన్నారు. గత ఏడాది కూడా మండలంలోని మరో 3 పాఠశాలల్లో ఈ తరగతులు విజయవంతంగా నడుస్తున్నాయని, ఇప్పుడు కొత్తగా మరో ఐదు పాఠశాలలకు విస్తరించడం సంతోషకరమని తెలిపారు. స్థానిక తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన కోరారు. ఈ పాఠశాలల్లో బోధన, సహాయక సిబ్బందిగా పనిచేసేందుకు ఆసక్తి గల స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ తెలిపారు. జూన్ 5, 2026 నుంచి సంబంధిత గ్రామ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల (HM) వద్ద దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

అర్హతలు ఇవే...

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. డీఈడీ /టీటీసీ/ఈసీఈ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్‌తో పాటు బోనఫైడ్, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు మరియు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను జత చేయాలి. ఆయా ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

Next Story