- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTRNeel: 'డ్రాగన్'లో షాహిద్ కపూర్
డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై మేకర్స్ ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు, ఈ ప్రాజెక్ట్‌పై షాహిద్ కపూర్ కూడా పాజిటివ్‌గా స్పందించినట్లు సమాచారం. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ నటిస్తే సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత హైప్ పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ ఉంటే, సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లవారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
‘జై హనుమాన్’ మూవీలో ఊహించని సర్‌ప్రైజ్.. కథను మలుపు తిప్తే పాత్రలో టాలీవుడ్ హీరో






