- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jr NTR and Prashant Neel movie update : ఎగురుతున్న ఫ్లైట్‌లో ఎన్టీఆర్ యాక్షన్
ఎగురుతున్న ఫ్లైట్‌లో ఎన్టీఆర్ యాక్షన్… ఇంటర్వెల్ సీన్‌పై భారీ హైప్.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు అధికారికంగా టైటిల్ ప్రకటించకపోయినా, ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఇంటర్వెల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఎగురుతున్న ఫ్లైట్‌లో హీరో–విలన్ మధ్య ఈ యాక్షన్ సన్నివేశం ఉండనున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాన్ని అత్యంత ఖర్చుతో, గ్రాండ్ గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ చిత్రంలో ఒక్క ఈ యాక్షన్ ఎపిసోడ్ మాత్రమే కాకుండా మరికొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా భారీ స్థాయిలో రూపొందించినట్లు సమాచారం. దాంతో ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చారు. గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమాలు ఎక్కువగా బ్లాక్ అండ్ గ్రే షేడ్స్‌లో కనిపించేవి. అయితే ఈ చిత్రం మాత్రం ఆయన శైలికి భిన్నంగా, కలర్‌ఫుల్ విజువల్స్‌తో రూపొందించబడుతున్నట్లు తెలుస్తుంది.






