- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'కల్కి 2'లో కొత్త నెగిటివ్ పాత్ర?
'కల్కి 2'లో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ?.. ఫ్యాన్స్‌లో పెరిగిన ఉత్కంఠ.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగం షూటింగ్ ప్రారంభమయ్యింది. వచ్చేనెల మొదటి వారం నుంచి ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి భాగంలో కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. రెండవ భాగంలో కూడా ఈయనే ప్రధాన ప్రతినాయకుడిగా కనిపిస్తారని చాలా మంది భావించారు.
అయితే ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం కథను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రెండవ ప్రతినాయకుడి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసి, ఆ పాత్ర కోసం ఓ బాలీవుడ్ స్టార్ నటుడిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రెండవ బాగం మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ చిత్రాల తర్వాత ప్రభాస్‌కు మళ్లీ భారీ స్థాయి విజయాన్ని అందించిన చిత్రంగా 'కల్కి 2898 AD' నిలిచింది. దాంతో ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా రెండవ భాగంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.






