- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఒకే రోజు మూడు అప్డేట్స్ !
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఆయన పుట్టిన రోజున మూడు సినిమాల అప్డేట్స్ రానున్నాయని టాక్.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టారు. అయితే ఈ మూడు సినిమాల నుంచి ఒకే రోజున అప్డేట్స్ ఇచ్చేందుకు ఆయా చిత్ర బృందాలు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మార్చి 20వ తేదీన అన్న సంగతి తెలిసిందే.
ఆ రోజున ప్రశాంత్ నీల్-NTR కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ గ్లింప్స్ వదలనున్నారు. 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ అప్డేట్ రానున్నట్లు టాక్. అటు గాడ్ ఆఫ్ వార్ సినిమాపై అనౌన్స్ మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను త్రివిక్రమ్ చేస్తున్నారు. అటు దేవర 2 సినిమాకు సంబంధించిన పోస్టర్ మే 2వ తేదీన రిలీజ్ చేసేందుకు కొరటాల శివ కూడా రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. అంటే ఒకే రోజున మూడు అప్డేట్లు రాబోతున్నాయన్నమాట. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.






