- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కాగానే విజయ్ బంపర్ ఆఫర్..ఇక తిరుగులేదు !
‘కరుప్పు’ కు ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక షో లు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: హీరో సూర్య లేటెస్ట్ గా నటించిన సినిమా ‘కరుప్పు’. ఈ సినిమా మే 14వ తేదీన అంటే రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాను సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. సూర్య లేటెస్ట్ సినిమా ‘కరుప్పు’ కు ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక షో లు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చిత్ర బృందం, హీరో సూర్య హర్షం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తమిళ్ హీరో సూర్య లేటెస్ట్ గా నటించిన కరుప్పు సినిమాను ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో హీరోగా సూర్య నటిస్తుండగా.. హీరోయిన్ గా త్రిష మెరువనున్నారు. కోర్టు, లాయర్ల పనితీరు, సామాజిక న్యాయం చుట్టూ ఈ సినిమా కథ కొనసాగనుంది.






