- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోతో ఆ పని చేయకపోవడం ఒక తీరని లోటుగా మిగిలిపోయింది.. హీరోయిన్ ఆమని ఎమోషనల్ కామెంట్స్
అలనాటి స్టార్ హీరోయిన్ ఆమని(Amani) మనందరికీ సుపరిచితమే. అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ ఆమని(Amani) మనందరికీ సుపరిచితమే. అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలా 1992లో ‘జంబలకిడిపంబ’(Jambalakidi pamba) సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆమని, ఆ తర్వాత తెలుగు చిత్రసీమలో అగ్ర నటిగా ఎదిగారు. ‘శుభలగ్నం’(Subhalagnam), ‘మావిచిగురు’(Maavichiguru), ‘శుభ సంకల్పం’(Subha Sankalpam) వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ చిన్నది నటించిన ‘మిస్టర్ పెళ్లాం’(Mister Pellam) చిత్రంలో ఆమె నటనకు గాను ప్రతిష్టాత్మక నంది అవార్డు లభించింది. ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సీరియల్స్ చేస్తూ మెప్పిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘శుభలగ్నం, మిస్టర్ పెళ్లాం వంటి అనేక వైవిధ్యభరితమైన పాత్రలు పోషించినందుకు గర్వపడుతున్నాను. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించలేకపోవడం తన కెరీర్‌లో ఒక తీరని లోటుగా మిగిలింది… నేను చిన్నతనం నుండి చిరంజీవికి వీరాభిమానిని. ఆయన పక్కన హీరోయిన్‌గా నటించాలని ఎన్నో కలలు కనేదాన్ని.
ఇందులో భాగంగా శుభలగ్నం తర్వాత చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన రిక్షావోడు చిత్రంలో నాకు కథానాయికగా అవకాశం వచ్చింది. డేట్స్ కూడా ఖరారు అయ్యాయి. ఇక షూటింగ్‌కు కొన్ని రోజుల ముందు చిరంజీవితో మాట్లాడడం కూడా జరిగింది. అయితే, డైరెక్టర్ కోదండరామిరెడ్డి స్థానంలో కోడి రామకృష్ణ వచ్చిన కారణంగా నా స్థానంలోకి నగ్మాను తీసుకున్నారని ఓ వార్త చదివాను. ఈ సంఘటన నన్ను తీవ్ర నిరాశను కలిగించింది. చిరంజీవితో సినిమా చేయలేకపోవడం జీవితాంతం వెంటాడుతుంది అని ఆమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Read More..
పెళ్లిపై ఓపెన్ అయిన ఆషికా రంగనాథ్.. అలాంటి క్వాలిటీస్ ఉన్నవాడే కావాలి!






